గతేడాది నెక్సస్ ఫోన్లకు గుడ్ బై చెప్పేసిన గూగుల్.. ఇప్పుడు కొత్తగా పిక్సెల్ సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టబోతోంది. హై ఎండ్ ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చిన ఆ ఫోన్ల ధర 57 వేలకు పైనే ఉండటంతో వాటిని కొనేందుకు సామాన్యలు ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బడ్జెట్ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో త్వరలో తక్కువ ధరలో ఫోన్లను కూడా రిలీజ్ చేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది.


ఈ ఏడాది పిక్సెల్ పీ2, పిక్సెల్ పీబీ పేర్లతో రెండు మోడల్స్ మార్కెట్ లోకి తీసుకు రాబోతోందట. అందులో పిక్సెల్ పీ2 ధర ఇప్పుడున్న పిక్సెల్ ఫోన్ల కంటే ఎక్కువగా ఉంటుందట. పిక్సెల్ పీబీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుందని టాక్. పిక్సెల్ పీ2లో వాటర్ ప్రూఫ్ తో పాటు కెమెరా క్వాలిటీ పెంచేందుకు గూగుల్ కసరత్తలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ర్యామ్ సామర్ధ్యంతో పాటు డిస్ ప్లే రిజల్యూషన్ ను పెంచుతోందట.


గూగుల్ బడ్జెట్ ఫోన్ ధర 13 వేల నుంచి 20 వేల మధ్యలో ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫోన్లను ఈ ఏడాది మధ్యలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: