డ్రోన్ లు నిఘా వ్యవస్థ విషయం లో చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి. శక్తిమంతమైన డ్రోన్ లతో విదేశీ రహస్యాల కార్యకలాపాల మీద కూడా కన్నేసి ఉంచి ఆపదలు ముందే కనిపెట్టడం వీలు అవుతోంది. ఈ మధ్యే భారత భూభాగంలో 12 వేల అడుగుల ఎత్తులో తన విమానానికి దగ్గర్లో ఓ డ్రోన్ కనిపించిందని, ఏవియేషన్ విభాగానికి సదరు పైలట్ ఫిర్యాదు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందుకే, డ్రోన్ లపై వివిధ దేశాల్లో నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ డ్రోన్ ల స్థానంలో గబ్బిలాల్లాంటి రోబోను కాల్ టెక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది అచ్చం గబ్బిలంలా రెక్కలు విప్పుకుని, వాటిని పైకి, కిందకు అల్లాడిస్తూ ప్రయాణిస్తూ పని చేస్తుంది. దీనితో ఎన్నో ఉపయోగాలున్నాయని దీన్ని తయారు చేసిన కాల్‌ టెక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: