యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు తన వినియోగదారులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫేస్ బుక్ , ట్విట్టర్ లో మాదిరి గా యూట్యూబ్ లో కూడా ఇప్పుడు లైవ్ స్త్రీం పెట్టుకోవచ్చు. పదివేల మంది ఫాలోవార్ లు ఉంటే ఈ పని చేసుకోవచ్చు.త్వరలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంస్థ అధికారులు పేర్కొన్నారు. యూట్యూబ్ మొబైల్  యాప్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. మామూలుగా అప్‌లోడ్ చేసే వీడియోకు ఉన్నట్టే దీనికి కూడా ఆప్షన్లు ఉంటాయని వారు పేర్కొన్నారు. అంతేకాక ‘మానిటైజేషన్’ టూల్ ‘సూపర్ చాట్’ ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని సదరు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: