రిలయన్స్ జియో దెబ్బకి అన్ని కంపెనీ లూ నష్టాల్లో తేలుతూ ఉన్నా పైకి మాత్రం తమకి నష్టాలేమీ లేవులే అన్నట్టే ఉన్నారు. మొట్టమొదటి సారి ఐడియా కంపెనీ మాత్రం తీవ్ర నష్టాలు చవి చూస్తోంది. మొదటి త్రైమాసిక నష్టాలు ఆ సంస్థ కి చుక్కలు చూపిస్తున్నాయి. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో ఐడియా ఏకంగా రూ.384 కోట్లు నష్టపోయింది. గతేడాది ఇదే సమయంలో రూ.660  కోట్ల లాభాలు ఆర్జించిన ఐడియాకు ప్రస్తుత నష్టాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. జియో కారణంగా ఐడియా ఆదాయం 3.7 శాతం క్షీణించింది. ఐడియా నష్టాలకు జియో ఉచిత ఆఫర్లే కారణమని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: