రోజు రోజుకూ పెరిగిపోతున్న జియో యూజర్ ల కోసం కొత్త గా 6 అంకె తో మొదలయ్యే సెల్ ఫోన్ నెంబర్ ల సీరీస్ ని తీసుకొస్తోంది రిలయన్స్ సంస్థ.ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో మాత్రమే 6తో మొదలయ్యే నంబర్లను కేటాయిస్తామని జియో స్పష్టం చేసింది. రాజస్థాన్ లో 60010 - 60019 ఎంఎస్సీ (మొబైల్ స్విచ్చింగ్ కోడ్), అసోంలో 60020 - 60029, తమిళనాడులో 60030 - 60039 ఎంఎస్సీలో కనెక్షన్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్ లో 7 సిరీస్ లో, కోల్ కతా, మహారాష్ట్రల్లో 8 సిరీస్ లో కొత్త నంబర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: