ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూసిన 104 ఉపగ్రహాల రాకెట్‌ను భారత పరిశోధనా సంస్థ ఇస్రో నింగిలోకి పంపించి చరిత్ర సృష్టించింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీసీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇది మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. తనతోపాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 104 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది.



ఇందులో భారత ఉపగ్రహాలు మూడు ఉండగా, మిగిలినవన్నీ విదేశీ ఉపగ్రహాలే. వీటిలో భారత్ కు చెందిన 714 కిలోల బరువున్న కార్టోశాట్ 2డీ ఉపగ్రహం అత్యంత బరువైనది. . 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8. మిగిలిన వాటిలో ఇజ్రాయిల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం, మన దేశానికి చెందినవి మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. 



524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం మొదలవుతుంది. 20 నిమిషాల తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోవడం ప్రారంభమవుతుంది. మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్టోశాట్‌-2 714 కిలోలు, ఐఎన్‌ఎస్‌ 1ఎ, ఐఎన్‌ఎస్‌ 1బి ఉపగ్రహాలు ఒక్కోటి 14 కిలోల బరువున్నాయి. మిగలిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: