భారతీయ మార్కెట్ లోకి ఇంకా రాకుండా నే నోకియ ఫ్లాగ్ నోకియా 6 ఫోన్ ఆన్ లైన్ లో లభిస్తోంది. ఈ కామర్స్ సంస్థ ఈబే లో ఈ ఫోన్ లు 32 వేల నుంచీ లభిస్తున్నాయి. అయితే, చైనాలో మాత్రం ఇవి రూ. 17 వేలుకే దొరుకుతున్నాయి. 25 రోజుల్లో ఫోన్ డెలివరీ అవుతుందని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్ ఉండటం, ఆక్టాకోర్ ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ కాగా, నోకియాకున్న బ్రాండ్ పేరుతో ఈ ఫోన్ అమ్మకాలు భారీగా సాగుతాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ అధికారికంగా భారత మార్కెట్లో త్వరలో విడుదల కానుందని భారత్ లో నోకియా ఫోన్ల డీలర్ హెచ్ఎండీ గ్లోబల్ ప్రతినిధులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: