సాంసంగ్ ఎలెక్ట్రానిక్ సంస్థ కి కోలుకోలేని షాకింగ్ దెబ్బ తగిలింది. ఈ సంస్థ చీఫ్ ని పోలీసులు అరస్ట్ చెయ్యడమే షాకింగ్ న్యూస్ . ఒక రోజు మొత్తం ఆయన ని వారి దగ్గర పెట్టుకుని విచారణ చేసారు. ఈ విచారణ అంతా కూడా రహస్యంగా జరగడం విశేషం. పార్క్ గ్యూన్ - దక్షిణ కొరియా అధ్యక్షురాలు కి వ్యతిరేకంగా జరిగిన అవినీతి లో ఇతని హస్తం ఉంది అనే వాదనల నేపధ్యం లో ఇతన్ని అరస్ట్ చేసారు. ఈ కుంభకోణంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిందని ఆరోపణలు ఉన్నాయి. జే లీ అరెస్ట్ నేపథ్యంలో, శాంసంగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.అయితే, ఈ విచారణపై ఆయన పైకోర్టులో అప్పీల్ చేస్తారా? లేక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని... లంచాలు కూడా ఇవ్వలేదని జే లీ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: