వాట్స్ యాప్ లేటెస్ట్ ఫీచర్ లు వినియోగదారులకి అంతగా నచ్చలేదు అనేది ఓపెన్ సీక్రెట్ .. కొత్త ఆప్షన్ లతో సరికొత్తగా రూపు మార్చుకున్న వాట్స్ యప్ కి వినియోగదారుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. దీంతో పునరాలోచనలో పడ్డ వాట్స్ యాప్ గతంలో ఉన్న టెక్స్ట్ బేస్‌డ్ ఫీచర్‌ కే తిరిగి మారుతున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రొఫైల్ స్టేటస్ లో ఫొటోతో పాటు తమ గురించి తెలిపే ఇంట్రడక్షన్ రూపంలో చిన్న టెక్స్ట్ రాసుకునేందుకు వీలుండేది.


దీని స్థానంలో సరికొత్త స్టేటస్ ఫీచర్‌ పేరుతో ఫొటోతో పాటు చిన్నపాటి వీడియో కూడా స్టేటస్‌ గా పెట్టుకునేలా ఆప్షన్ తెచ్చారు. ఈ ఫీచర్ ఫాట్స్ యాప్ లో వచ్చిన అన్నిటినీ ఇరవై నాలుగు గంటల తరవాత రికార్డ్స్ లోంచి తీసేస్తుంది. ఆటోమేటిక్ గా స్టేటస్ మెసేజ్ లు కనిపించకుండా మాయమవుతున్నాయి. దీంతో కొత్త ఫీచర్ బాగోలేదంటూ వినియోగదారులు పెదవి విరిచారు. దీంతో మళ్ళీ మార్చుకుని వాట్స్ యాప్ తన పాత ఫీచర్ లు వెనక్కి పంపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: