మరొక కొత్త విధానం లో ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెర్చింజన్ గూగుల్ కి చెందిన జీమెయిల్ ఐడీ ఉంటే చాలు డబ్బులు పంపుకునే విధానం రాబోతోంది. అయితే, జీ మెయిల్ యాప్ ను ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉంటుంది. జీ మెయిల్ లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్ లో అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ, ఎంత మొత్తం డబ్బు పంపుతున్నామనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. దీంతో, అవతలి వ్యక్తికి మెయిల్ ద్వారా అందిన డబ్బును, బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీ మెయిల్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త మనీ ట్రాన్స్ ఫర్ విధానానికి ఎలాంటి ఫీజును యూజర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా, మనీ ట్రాన్స్ ఫర్ కు ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఆధార్ పే వంటి వివిధ మార్గాలను వినియోగదారులు ప్రస్తుతం అనుసరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: