చరిత్ర ని తిరగ రాస్తూ బాహుబలి 2 ట్రైలర్ టాలీవుడ్ కే ఒక ప్రామాణికం గా సాగుతోంది. రికార్డ్ వ్యూస్ తో తిరుగులేని ఈ ట్రైలర్. భారతీయ సినిమాకి సాధ్యం కాని రీతి లో ఐదు కోట్ల వ్యూస్ ని కేవలం 24 గంటల్లో సాధించింది,అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డ్ సాధించడానికి జియోనే ప్రధానకారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్‌వర్క్ సంస్థ జియో, ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఈ రికార్డ్ సాధ్యమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇక పై రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్‌లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: