Image result for iit kharagpur campus CSE &  IT department Drone project


భారత్ లో ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంది. మహాబారతం లోని పాండవు ల ద్వితీయ సహోదరుడైన భీముని చేత ప్రభావితమైన ఐఐటి ఖరగ్ పూర్ కంప్యూటర్ సైన్స్  ఇంజినీరింగ్ శాఖ విద్యార్ధులు మనదేశం లోనే మొట్టమొదటి పూర్తిగా భారతీయ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన "డ్రోన్" ను సృష్టించారు. ఒక మీటర్ కంటే తక్కువ పొడవైన మానవ సహాయం లేకుండానే పనిచేయ గలగటమే ఈ అద్భుత పరికరం ప్రత్యెకత.


Image result for iit kharagpur campus CSE &  IT department Sudeep Misra team


దీని సృష్టికర్తలు చెప్పుతున్నట్లు దీని "స్టేటాఫ్ ఆర్ట్ ప్రొటక్షన్ షీల్డ్" ఎంతో ఉన్నతమైన తన స్వతంత్ర ఊహాజనిత లక్షణాలతో పనిచేయగల సామర్ధ్యం దీని స్వంతం. భీం ఆకాశములో తను  ఎగరగలిగే వాతావరణములో ఒక కిలోమీటర్ పరిధి లో  "వై-ఫై జోన్" ను సృష్టించి, నేర్పుగా, సురక్షితంగా  సమాచారాన్ని సమాచార కేంద్రానికి పంప గలదు. ఏడు గంటలు నిర్విరామంగా పనిచేయగల బ్యాటరి బాకప్ తో మానవులు ప్రవేసించలేని సంక్లిష్ట, ప్రమాదకర  ప్రాంతాల్లో, హోరాహోరీగా యుద్దం జరిగే డిజాష్టర్ జోన్స్ లో  కూడా సంచరిస్తూ సమాచార సేకరణ, రవాణాను అతి సురక్షితంగా చేయగలదు. సమాచారా న్ని సైనిక వ్యవస్థలకు నిరంతరంగా ప్రవాహం మాదిరిగా ఏప్రాంతాల్లో ఉన్నా ఆ ప్రాంతాల్లోకే చేర్చగలగడమే కాదు సమాచార వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరించగల అనన్య సామాన్య సమర్ధత కలిగి ఉన్నట్లు చెప్పుతున్నారు.


Image result for iit kharagpur campus images


దీనిద్వారా సైన్యం గాని సాధారణ ప్రజలు కాని ప్రమాద పరిస్థితిల్లో చిక్కుకొని ఉంటే వారిని ఆ క్లిష్ట పరిస్థితుల నుండి వారిని తప్పించే నెట్-వర్క్ సమాచారాన్ని ఇది అందించగలదట. దీని నిజమైన సామర్ధ్యం ఎవరూ సంచరించలేని అతి క్లిష్టతర ప్రాంతాల్లో సుదూర ప్రాంతాలకు కూడా అంటే “లాంగ్ జర్నీ ఫ్లయిట్స్” మాదిరిగా ఆకాశములో సంచరిస్తూ సమాచార సేకరణ చేయగలదట. అంటే దీన్ని పారాచూట్స్ ద్వారా క్లిష్టతర వాతావరణమున్న ప్రదేశాల్లో వదిలితే చాలు దాని పని అది చేసుకోగల కృత్రిమ పరిజ్ఞానం అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తుంది. అంటే సరిహద్దుల వద్ద, అనుమానాస్పద వాతావరణాన్ని పరిశీలించి పహరాల కార్యక్రమాలను స్వతంత్రంగా నిర్వహిస్తూ కావలసిన నిర్దేసిత సమాచార వినిమయం చేయగలదని తెలుస్తుంది. అంటే సరిహద్ధులవద్ద హద్దుమీరిన వారి వివరాలను చిత్రాలను సైనికులకు లేదా రక్షణ వ్యవస్థకు అందించగలదు.


Image result for iit kharagpur campus CSE &  IT department images


ప్రస్తుతము దేశ విదేశాల్లో లభించే డ్రోన్స్ లో "బిల్ట్-ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" ఇప్పటికైతే లేదు. ఈ సాంకేతికత దేశీయ ప్రయోగశాలలోనే అభివృద్ది చేసి అత్యవసర పరిస్థితులను అధిగమించటానికి ఆటోమాటిక్ గా విజన్ ఆధార మార్గదర్శనం తో పనిచేసేలా దీన్ని నిర్మించారు. తద్వారా ఉదాహరణకు ఒక ప్రాంతములో ట్రాఫిక్ ఎలా వుందో ఇది చూసి చెప్పగలదు. ట్రాఫిక్ ప్రోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారిమళ్ళించేందుకు పోలీస్ వ్యవస్థ దీన్ని వినియోగించుకోవచ్చు. అంటే సాధారణ అవసరాలైన నియంత్రణ, మార్గదర్శన, రక్షణ మొదలైన అంశాలను పనులను నిర్వహించే మౌలిక సాకేతికతతో దేశీయ పరిజ్ఞానంతో దీన్ని డిజైన్ చేశారు.    


Image result for iit kharagpur campus CSE &  IT department Drone project

 

భీం ప్రత్యేకతలు


అతి చిన్న పరిమాణం

అతి తేలికైన దేహం

బలమైన దేహ చలనం

దేశీయ పరిజ్ఞానంతో నిర్మించబడ్ద దేహాంగాలు,

చురుకైన, సునిసితమైన, అతి తేలికగా చలించగల కృత్రిమ పరిజ్ఞానం  

నిరంతర వైర్లెస్ సమాచార సాంకేతికత

ప్రమాద నివారణకు అవసరమైన అంతర్జాల సేవలు అదీ సంక్లిష్ట వాతావరణములో కూడా

ప్రమాదం వలన అంతర్జాలం దెబ్బతిన్నా, భూ వాతావరణం సహకరించకున్న రేడియో తరంగాలు కూడా సేవ చేయలేని పరిస్థితుల్లో కూడా దీనిలోని “ఏరియల్ వై-ఫై బ్రోడ్-కాష్ట్”  ఒక వరం లా కొంతసేపు పనిచేయ గలదని ఫాకల్టి సభ్యుడైన సుదీప్ మిశ్రా చెప్పారు.


అవసరమైతే ఎవరైనా నియమిత పరిదిలో డ్రోన్ ను లాగ్-ఆన్ అవుతూ దీని పనిచేసే పరిధిని ఇతరత్రా పరిస్థితులను సవరించవచ్చని తెలిపారు.

ఇంకా దీని డిజైన్ లో అంతర్జాల వస్తువులను, అంతర్గతంగా ఫిజికల్ డివైజెస్, వాహనాలు, భవనాలతో అనుసంధానిచే ఏర్పాట్లు కలిగి సెన్సర్స్, యాక్చుయేటర్స్ మొదలైన సాఫ్ట్-వేర్ తో  వీటితో డేటా ఎక్చేంజ్ చెసుకోగలగటం దీని ప్రత్యెకత. ఈ రోజుల్లో ఇంటెలిజెంట్ భవనాలు, స్మార్ట్ సిటీలు, అంటూ ఐ.ఓ.టి (ఇంటెర్నెట్ ఆఫ్ థింగ్స్) అంటే ఎంబెడ్డేడ్ ఎలక్టానిక్స్ ను ఉపయోగించుకోవటం చూస్తూనే ఉన్నాం కదా! ఈ డ్రోన్స్ వైర్లెస్ విధానంతో ఆటోమాటిక్ గా అనుసంధానం చేసుకొని సమాచార మార్పిడి చేసే సామర్ధ్యం కలిగి ఉంటాయని మరో ఫాకల్టి రఘువంశీ చెప్పారు. అనంద్-రూప్ ముఖర్జీ, అరిజిత్ రాయ్ స్కాలర్స్ వీరికి ఈ ప్రోజెక్టులో సహకరిస్తున్నారు. 


Image result for iit kharagpur campus CSE &  IT department images

మరింత సమాచారం తెలుసుకోండి: