వైఫై లేకపోయినా పరవాలేదు కానీ స్లో గ ఉండే వైఫై తో ఎక్కడ లేని బీపీ వస్తుంది. ప్రస్తుతం ఉన్న వేగానికి వంద రెట్ల వేగంతో పని చేసే వైఫై ని మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు. వారు అభివృద్ధి చేసిన ఈ వైఫై ద్వారా సెకన్ కి నలభై జీబీ ల డేటా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‌‌లకు వైఫ్ కనెక్టి చేసి వాడుకున్నా దాని వేగం ఏమాత్రం తగ్గదు. ఒక్కో డివైజ్‌కు ఒక్కో పరారుణ కాంతికిరణం అనుసంధానం అవడం వల్ల వైఫైని ఎన్ని పరికరాలకు కనెక్ట్ చేసుకున్నా వేగంలో మార్పు రాదు. నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ నూతన వైఫైని అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదం లేని పరారుణ కిరణాలను ఉపయోగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: