ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రై మాసికం ఆర్ధిక ఫలితాలు విడుదల చేసింది.కన్సాలిడేటెడ్ విధానంలో సంస్థ నికర లాభం మార్చి 31తో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో రూ. 3,603 కోట్లుగా నమోదైందని సంస్థ తెలిపింది. అంతకుముందు త్రైమాసికం నెట్ ప్రాఫిట్ రూ. 3,708 కోట్లతో పోలిస్తే, ఇది 2.83 శాతం తక్కువ. మొత్తం ఆదాయం సైతం 0.89 శాతం తగ్గి రూ. 17,120 కోట్లకు తగ్గిందని సంస్థ వెల్లడించింది. ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకున్న వేళ, తాము మెరుగైన ఫలితాలను చూపామని, ఈ సందర్భంగా ప్రతి షేరుపై రూ. 14.75 డివిడెండ్ గా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది 



మరింత సమాచారం తెలుసుకోండి: