ఏ టెలీకాం సంస్థ అయినా ఇంటర్నెట్ స్పీడ్ ని చాలా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. టెలీకాం మార్కెట్ లో ఫ్రీ ఆఫర్ లతో ఇప్పటికే సంచలనం రేపుతున్న జియో నాణ్యమైన సేవల విషయం లో కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన‌ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడులో ఇత‌ర అన్ని టెలికాం కంపెనీల కన్నా ముందు స్థానంలో నిలిచింది. 16.48 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో మార్చిలో కూడా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్‌టెల్ స్పీడ్ కంటే దాదాపు రెండు రెట్ల‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: