భవిష్యత్తు మొత్తం రోబోలతో నిండిపోబోతున్న క్రమం లో స్టార్ వార్స్ సినిమాల టైపు లో రోడ్డు మీద రయ్యని దూసుకుపోయే కారు అకస్మాత్తుగా రాబోతోంది. స్లోవేకియాకు చెందిన ఏరోమొబిల్‌ అనే ఆటోమొబైల్‌ సంస్థ కమర్షియల్‌ డిజైన్‌ లో ఫ్లయింగ్‌ కారును తయారు చేసింది. ఈ కారుకు ముందస్తు ఆర్డర్లు త్వరలో ప్రకటించనున్నామని తెలిపింది.


బుక్ చేసుకున్న వినియోగదారులకు 2020 నాటికి ఈ కార్లను డెలివరీ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అందులో భాగంగా తొలి ఎడిషన్ పేరిట 500 కార్లను ఉత్పత్తి చేస్తామని ఏరోమొబిల్‌ పేర్కొంది. ఈ కారు ధర 1.29 మిలియన్‌ డాలర్ల (8 కోట్ల రూపాయల) నుంచి 1.61 మిలియన్‌ డాలర్ల (10 కోట్ల రూపాయల) మధ్య ఉంటుందని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: