తిండీ బట్టా లేకపోయినా సెల్ ఫోన్ లేకపోతే గడవని రోజులు మనవి. కానీ సెల్ ఫోన్ లో చార్జింగ్ ఉండకపోవడం మనందరికీ చాలా ఇబ్బందికర విషయం. చాలా విషయాలలో మనం తలనొప్పులు ఎదురు కొంటూ ఉంటాం కానీ చార్జింగ్ విషయం లో ఎక్కడ లేని చిరాకు వస్తూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ల కోసం కొత్త రకం బ్యాటరీ లు వస్తున్నాయి.అయితే అవి అందులో పవర్ ఉన్నంత వరకు మాత్రమే పని చేస్తాయని, తాము తయారు చేసిన పరికరం బ్యాగులో ఉంటే ఆ పరికరాలతో పని లేదని కెనడాకు చెందిన సీఫార్మిటిక్స్ అనే సంస్థ చెబుతోంది.


వాటర్ లిలీ అంటే ముద్దుగా పిలిచే ఈ పరికరం ప్రత్యేకత ఏంటంటే...వీచే గాలి, పారే నీటితో విద్యుత్ ను తయారు చేసి, బ్యాటరీ ఫుల్ చేయడం. ఇది బ్యాగులో పట్టేంత చిన్న పరికరమే కాకుండా 800 గ్రాములకు మించని బరువుతో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇది చాలా నెమ్మదిగా పారే నీటిలో కూడా 25వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది


మరింత సమాచారం తెలుసుకోండి: