ప్రముఖ అంతర్జాల (ఇంటర్నెట్) సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన ‘గూగుల్‌ ప్లే మ్యూజిక్‌’ లో కొత్తగా చేరే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. కొత్తగా గూగుల్ ప్లే స్టోర్ లో చేరే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నాలుగు నెలలపాటు ఉచితంగా పాటలు విని ఆనందించే అవకాశం కల్పించామని చెప్పింది. ఈ ఆఫర్ తో గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్రరీలోని 50,000 పాటలు వినే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.


తొలుత ఈ ఆఫర్ ను మూడు నెలలపాటు మాత్రమే ప్రకటించినట్టు తెలిపిన గూగుల్ సంస్థ, తాజాగా మరో నెల అదనంగా పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ ను కేవలం స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే కాకుండా, గూగుల్ ప్లే మ్యూజిక్ సాయంతో కంప్యూటర్, మొబైల్ లో ఎఫ్ఎం రేడియోను కూడా ఆస్వాదించవచ్చని గూగుల్ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: