మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు ఇత‌రుల‌తో పంచుకునేందుకు వీలుగా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఓ యాప్ ను రూపొందించింది. దీని పేరు `ఎనీటైమ్‌`. వాట్సాప్‌లో ఉండే అన్ని స‌దుపాయాల‌తో పాటు కొన్ని అద‌న‌పు సౌక‌ర్యాలను కూడా ఈ యాప్ క‌ల్పించ‌నుంది. దీన్ని వినియోగించాలంటే ఫోన్ నెంబ‌ర్ కూడా అవ‌స‌రం లేదు.


అలాగే స్నేహితుల‌ను, తెలిసిన వాళ్ల‌ను పేరుతో సెర్చ్ చేసుకునే స‌దుపాయం ఉంది. కేవలం స్మార్ట్‌ఫోన్‌లోనే కాకుండా ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్ర‌య‌త్నిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: