ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతిరోజు టెక్నాలజీ అభివృద్ది చేసేందుకు ఆయా రంగాల్లో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు.  ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.  ఒకప్పుడు మనుషులతో మాట్లాడటం అంటే ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ సెల్ ఫోన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల కమ్యూనికేషన్ లో ఎంతో మార్పు వచ్చింది.  ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడివారైన తమ ముందు ప్రత్యక్షం అవుతున్నారు.  
Image result for amazon anytime app
ఇక సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు గత కొంత కాలంగా వాట్సప్ కూడా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.   చాలా మంది వాట్సప్ లో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నారు.  తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పుడు వాట్సాప్‌నకు పోటీగా మరో కొత్త యాప్‌ ను తీసుకురాబోతోంది. ‘ఎనీటైమ్‌’ పేరిట దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.  ఇందులో ముఖ్యమైన మెసేజ్‌లను ఎన్‌క్రిప్ట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అటు మొబైల్‌తో పాటు, డెస్క్‌టాప్‌లోనూ పనిచేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
Image result for amazon anytime app
వాట్సాప్‌ మాదిరిగా వీడియోలను, ఇమోజీలు, స్టిక్కర్లు, జిఫ్‌ ఇమేజ్‌లను సైతం పంపుకోవచ్చు. ఫోన్‌ నంబరుతో సంబంధం లేకుండా పేర్లు ద్వారా స్నేహితులు ఈజీగా కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవొచ్చు.  త్వరలో దీన్ని వినియోగదారులకు తీసుకొచ్చేందుకు అమెజాన్‌ సన్నద్ధమవుతోంది. వాట్సాప్‌ తరహాలో ఈ యాప్‌లో చాట్‌ చేసుకోవడంతో పాటు, ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉండబోతోంది.గతంలో ‘చైమ్‌’ అనే యాప్‌ను రూపొందించగా.. తాజాగా అందరి వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను తీసుకురాబోతోంది.

Image result for whatsapp



మరింత సమాచారం తెలుసుకోండి: