టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. జియో వచ్చీ రావడంతోనే భారీ ఆఫర్లు ప్రకటించింది. వాటి ముందు ఇతర బడా నెట్ వర్క్స్ కూడా చేతులెత్తేశాయి. మూకుమ్మడిగా జియోపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ – ట్రాయ్ కు ఫిర్యాదులు కూడా చేశాయి. కానీ జియో ఏమాత్రం తగ్గలేదు. దాదాపు ఏడాదిపాటు ఉచితంగా సేవలందించిన జియో.. ఆ తర్వాత కూడా నామమాత్రపు ధరలతో వివిధ ప్లాన్లను ప్రకటించింది.

Image result for jio

ఉచిత సర్వీసుల తర్వాత ప్రకటించిన ప్లాన్లు కూడా మిగిలిన నెట్ వర్క్ లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి నెట్ వర్కులతో పోల్చితే జియో వసూలు చేస్తున్న ఛార్జీలు చాలా తక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా డేటా ప్లాన్లపై జియో ఎక్కువ దృష్టి పెట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా కాల్స్ ఉచితం అనడంతో కస్టమర్స్ ఎగబడ్డారు. ఏడాదిలోనే పది కోట్లకు పైగా కస్టమర్స్ జియోను ఎంచుకున్నారంటే దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


తన ఆఫర్లతో బెంబేలెత్తిపోతున్న ఇతర నెట్ వర్క్ లకు మరిన్ని పంఛ్ లు ఇచ్చేందుకు జియో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21వ రిలయెన్స్ ఏజీఎం జరగనుంది. ఇందులో రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరిన్ని ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారిని ఆక్టటుకునేందుకు 500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందించనున్నట్టు సమాచారం. ఇంటెక్స్ కంపెనీకి చెందిన 4జి వోల్టె సదుపాయం కలిగిన ఫోన్ ను ఈ ధరకే అందించేందుకు రెడీ అవుతోంది.


ఇక కాల్స్, డేటాకు సంబంధించి వంద రూపాయల్లోపు మరో ప్లాన్ ను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో వేగవంతమైన బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. జియో ఫైబర్ పేరుతో ఇప్పటికే 7 నగరాల్లో ప్రయోగాత్మకంగా బ్రాడ్ బాండ్ సేవలను అందిస్తోంది. ఊహించని వేగంతో అతి తక్కువ ధరలకే ఈ బ్రాడ్ బాండ్ సేవలు ఉండనున్నట్టు సమాచారం. మరి జియో ముందు మిగిలిన నెట్ వర్క్ లు ఏమాత్రం తట్టుకుంటాయో వేచి చూడాలి.


TAG WORDS:



మరింత సమాచారం తెలుసుకోండి: