జియో మరో సంచలనం సృష్టించింది. పైసా లేకుండానే ఫోన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి రిలయెన్స్ జియో ఊహకందని ఆఫర్లతో కస్టమర్లను మైమరపింపజేస్తోంది. తాజాగా రూ.0కే ఫోన్ అందించనున్నట్టు ప్రకటించింది. ముంబైలోని రిలయెన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన నిర్ణయాలు వెల్లడించారు.

Image result for mukesh ambani jio

రిలయెన్స్ జియో కస్టమర్లకోసం ఒక్క రూపాయి కూడా లేకుండా భారత్ ఇంటెలిజెంట్ స్మార్ట్ ఫోన్ ను అందించనున్నట్టు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అయితే.. సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇది మూడేళ్ల తర్వాత తిరిగి కస్టమర్లకు చెల్లించబడుతుంది. ఫోన్ ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయనున్నట్టు అంబానీ ప్రకటించారు. వాయిస్ కమాండ్ తో పాటు 22 భారతీయ భాషల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

Image result for jio sim

ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫోన్లు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. రూ.153 నెలవారీ ప్లాన్ లో ఫ్రీకాల్స్, అన్ లిమిటెడ్ డేటా పొందడం ఈ ఫోన్ స్పెషాలిటీ. రూ.309కే జియో ఫోన్ కేబుల్ కూడా లభిస్తుంది. నమో యాప్ ఇందులో ఇన్ బిల్ట్ గా లభిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ మన్ కీబాత్ లాంటి ప్రోగ్రామ్ లను వినొచ్చు.

Image result for jio mobile

పూర్తిగా భారత్ లో తయారైన ఈ ఫోన్ ను కొంతమంది ఔత్సాహిక యువకులు తయారు చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా యువతను ప్రోత్సహించేందుకు రిలయెన్స్ ఈ ఫోన్స్ తీసుకొస్తోంది. జియో ఫోన్లలో వాయిస్ కాల్స్ జీవితకాలం ఫ్రీ. ప్రస్తుతం జియోకు పన్నెండున్నర కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రోజులో ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియోలో భాగస్వాములవుతున్నట్టు ముఖేశ్ అంబానీ తెలిపారు.


నెట్ వర్క్ విషయంలో కూడా జియో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ముఖేశ్ అంబానీ తెలిపారు. వచ్చే ఏడాదిలోగా దేశంలోని 99శాతం జనాభాకు జియో చేరువవుతుందన్నారు. మిగిలిన నెట్ వర్కులతో పోల్చితే జియో డేటా వేగం చాలా అధికమని అంబానీ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: