కంప్యూటర్ తో  పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ మైక్రోసాఫ్ట్ పెయింట్ తో ఏదో విధంగా సంబంధం ఉంటుంది. తాము పనిచేసేటప్పుడు ఒక్కసారినా దాన్ని వాడి ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకునే క్రమంలో ఎంతోమంది పెయింట్ పై మౌజ్ తో  చిత్రవిచిత్రమైన బొమ్మలు గీసుకుని ఆనందపడి ఉంటారు. ఇప్పటికీ పిల్లలు పెయింట్ నే ఫస్ట్ ఓపెన్ చేసి ఏవేవో బొమ్మలు వేస్తుంటారు. కానీ పెయింట్ కు మైక్రోసాఫ్ట్ సమాధి కట్టేస్తోంది.


          అవును మీరు విన్నది నిజమే.! పెయింట్ కు ఇకపై ఎలాంటి అప్ డేషన్స్ ఉండబోవని మైక్రోసాఫ్ట్ సూచనప్రాయంగా వెల్లడించింది. మొట్టమొదటిసారి 1985లో పెయింట్ ను తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఇది బేసిక్ గ్రాఫిక్ ఎడిటింగ్ ప్రోగ్రామ్. విండోస్ వర్షన్ 1 ను తీసుకొచ్చినప్పుడే పెయింట్ ను ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత విండోస్ లో చాలా అప్ డేట్స్ వచ్చాయి. ప్రస్తుతం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తోంది. ఆపరేటింగ్ తీసుకొచ్చిన ప్రతిసారి పెయింట్ ను కూడా అప్ డేట్ చేసుకుంటూ వచ్చింది.

 Image result for windows paint

          అయితే విండోస్ 10 తర్వాతి అప్ డేషన్ ఆటమ్ (అమెరికాలో ఫాల్) లో మాత్రం పెయింట్ ను అప్ డేట్ చేయట్లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. అయితే పెయింట్ కు బదులుగా విండోస్ 10లో పెయింట్ 3డి ని తీసుకొచ్చింది. దీనికి, పాత పెయింట్ కు ఏమాత్రం సంబంధం లేదు. పెయింట్ ను మించి పెయింట్ 3డీ ఉంటోంది. కాబట్టి పెయింట్ ఫ్యాన్స్ ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదనేది మైక్రోసాఫ్ట్ సూచన.

Image result for windows paint

          అయితే దాదాపు 32 ఏళ్లపాటు పెయింట్ ను వాడిన యూజర్లకు మాత్రం ఇది నిరాశ కలిగిస్తోంది. పెయింట్ సేవలను మైక్రోసాఫ్ట్ నిలిపేయబోతోందని తెలియగానే సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతో బాధపడుతున్నారు. డోంట్ గో పెయింట్ అంటూ కొంతమంది వేడుకుంటుంటే.. RIP అంటూ మరికొంతమంది వీడ్కోలు పలుకుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: