ఇప్పటి వరకు భారత దేశంలో కమ్యూనికేషన్ పరంగా ఎన్నో నెట్ వర్క్ వచ్చాయి..వెళ్లాయి.  అయితే వాటిలో చాలా వరకు వినియోగదారులను బాగా ఎట్రాక్ట్ చేసుకున్న నెట్ వర్క్స్ చాలా తక్కువే అని చెప్పాలి.  ఇక ముఖేష్ అంబాని జియోతో కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఉచిత ఫోన్, కేవలం రూ.1,500 డిపాజిట్ చేస్తే చాలు అంటూ ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించడంతో అన్ని నెట్ వర్క్స్ ల్లో చలనం వచ్చింది.  Image result for jio net work
ఇప్పటికే ఎయిర్ టేల్, వొడా లాంటి నెట్ వర్క్ సంస్థలు భారీ ఆఫర్ల దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఐడియా  సెల్యులర్ కొత్త ప్లాన్ తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో పడింది. రిలయన్స్ జియో ఫీచర్  ఫోన్లోనే 4జీ బ్రాడ్ బ్యాండ్, నెలంతా ఉచితంగా మాట్లాడుకునే అవకాశాన్ని కేలం రూ.149కే పొందొచ్చని ప్రకటించింది.  
Image result for idea network
జియో దెబ్బకు  ఏప్రిల్ - జూన్ ఈ మూడు నెలల్లోనే ఐడియా సెల్యులర్ ఏకంగా రూ.815 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో జియో చౌక ఫోన్ కు పోటీగా తాము సైతం ఫోన్ తయారీదారులతో ఒప్పందాలు చేసుకుని, బండిల్డ్ ఆఫర్లను ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టు ఐడియా ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: