గత కొంత కాలంగా టెలికాం రంగాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది జియో.  ఇండియా టెలికం రంగంలో రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇతర నెట్ వర్క్ సంస్థలు సందిగ్ధంలో పడ్డాయి.ధరల యుద్ధంతో టెలికాం దిగ్గజాలను ఇది అతలాకుతలం చేసింది. ఇక ఈ వార్‌కు తెరపడబోతుం దట. రిలయన్స్‌ జియో తెరతీసిన ధరల యుద్ధం తుది దశల్లోకి చేరుకుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.   టెలికం పరిశ్రమలో త్వరలో ధరల యుద్దానికి తెరపడనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడింది వచ్చే నెల 12-18 నెలలో ఒక దశ వద్ద తన పోటీ వ్యూహన్ని హేతుబద్దం చేస్తోందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
జియో కారణంగా టారిఫ్ ప్లాన్స్ మార్చిన ఇతర కంపెనీలు
అంతేకాక ఇక రెవెన్యూలు, మార్జిన్లను ఆర్జించడంపైనే జియో ఫోకస్‌ చేస్తుందని పేర్కొంది.  దీంతో ముఖేష్‌ అంబానీ ఉచితాలకు ఇక ముగింపుకు వస్తుందని తెలిపింది.  కాగా, గత సంవత్సరం నవంబరులో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో, వాయిస్ కాల్స్ ను జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జీవితాంతం ఉచిత హమీలను కొనసాగించలేరు
పైగా ఇతర కంపెనీలతో పోలిస్తే, తక్కువ ధరకు 4జీ డేటాను అదిస్తుండటంతో ఎంతో మంది రిలయన్స్ జియో కనెక్షన్లు తీసుకున్నారు. భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలోని 10 శాతం టెల్కో చందాదారుల బేస్‌ను జియో స్వంతం చేసుకొంది. కానీ, ఈ భారీ డిస్కౌంట్ విధానాలు జీవితకాలం కొనసాగించలేదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్గ్ ఆశుతోష్ శర్మ చెప్పారు.
లాభం తగ్గినా మార్కెట్‌లో నిలబడేందుకు
జియో తెరతీసిన ఈ గేమ్‌లో పాల్గొన్న పోటీదారులంతా రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రెవిన్యూ లాభాలు తక్కువ ఉన్న.ప్పటికీ, మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి ఇతర టెలికం కంపెనీలు.. దరిమిలా కన్సాలిడేషన్ ఏర్పడింది. వోడాఫోన్, ఐడియాలు వీలినమయ్యాయి.
రెవిన్యూల కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే
టెలినార్‌ను ఎయిర్‌టెల్ స్వంతం చేసుకొంది. ఇక ఆర్‌కామ్, ఎంటీఎస్, ఎయిర్‌సెల్‌లు కూడ ఈ దిశలోనే ఉణ్నాయి. ఈ కన్సాలిడేట్‌లో వొడాఫోన్-ఐడియా విలీన సంస్థ, ఎయిర్ టెల్, జియో సంస్థలే 75-85 శాతం ఇండస్ట్రీ రెవెన్యూలను స్వంతం చేసుకోనున్నాయని ఆ సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: