గత కొంత కాలంగా చైనా ఫోన్లు ఏ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  భారత దేశంలో చైనా వస్తువులకు ముఖ్యంగా మొబైల్ తక్కువ ధరలో..ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో సామాన్యులు ఈ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రముఖ చైనా సంస్థ అయినా హువాయి తాజాగా మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.  
Image result for huawei p10
హువాయి పి10 ప్లస్ ఆర్కిటిక్ వైట్, ప్రెస్టీజ్ గోల్డ్ , గ్రీన్సీ, డాజ్లింగ్ బ్లూ, గ్రాఫైట్ బ్లాక్, డాజ్లింగ్ గోల్డ్, రోజ్ గోల్డ్, మూన్లైట్ సిల్వర్ వంటి రంగుల్లో లభిస్తుందని సంస్ధ ప్రకటించింది. గ్రాఫైట్ బ్లాక్ వేరియంట్ మరియు బ్రైట్ బ్లాక్ వేరియంట్ మధ్య వ్యత్యాసం ఉంది.హువాయి పి 10 ప్లస్ ఎండబ్ల్యూసి 2017 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు. స్మార్ట్ ఫోన్ 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 5.5అంగుళాల క్యూహెచ్ డి డిస్ ప్లే ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంది. 2.3గిగా ఆక్టా కోర్, 960ప్రొసెసర్ మాలీ జి71 ఎంపి8 గ్రాఫిక్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. రెండు వేరియంట్లలో మెమెరీ ని కలిగి ఉంది. 
Image result for huawei p10
హువాయి పి 10 పీచర్స్ :
ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఎమోషన్ యుఐ 5.0తో టాప్ ప్లేస్ లోఉంది. హువాయి పి10 ప్లస్ డ్యుయల్ ఎల్ఈడి , pdaf ,hdr,4k వీడియో రికార్డింగ్ తో 20మెగాపిక్సెల్ , 12మెగాపిక్సెల్ డ్యుయల్ లెన్స్ లైకా వెనక కెమెరా ఆప్టిక్స్ అలంకరించబడింది. Fhd 1080పి వీడియో రికార్డింగ్ కోసం 8మెగాపిక్సెల్ లైక్ సెల్ఫీ కెమెరా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: