గత సంవత్సరం నుంచి మొబైల్ రంగంలో ఎన్నో పెను మార్పులు తీసుకు వచ్చిన జియో ఇప్పుడు వినియోగదారులకు మరిన్ని సేవలు అందిస్తుంది.  దీంతో ఈ నెట్ వర్క్ తో పోటీ పడుతూ ఇతర్ నెట్ వర్క్ లు కూడా రేట్స్ తగ్గిస్తూ వచ్చాయి.  తాజాగా ఇప్పుడు జియోకి పోటీగా ఎయిర్ టెల్ ఇండియా సిద్ధమైపోతుంది.  రూ. 2,500 ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఎయిర్ టెల్ అందుబాటులోకి తేనుంది. పలు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్ టెల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం.
Image result for jio 4g mobile
ఇప్పటికే నెట్ వర్క్ చార్జీలా భారీగా తగ్గించిన ఎయిర్ టేల్ ఇప్పుడు అధికమొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.  
Image result for airtel new 4g phone
అంతే కాదు ఈ విషయం గురించి లావా, కార్బన్ సంస్థలు తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ డీల్  కుదిరిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఇక తమ కొత్త స్మార్ట్ ఫోన్ విషయమై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి వుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఈ ఫోన్ దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: