21వ శ‌తాబ్దంలో ఆవిష్క‌రించిన అద్భుతాల్లో యూట్యూబ్ ఒక‌ట‌ని చెబుతారు నెటిజ‌న్‌లు. యుట్యూబ్ ఎన్నో వినోదభరితమైన వీడియోలకి ఎంతో విలువైన సమాచారానికి వేదిక. బోర్ కొడితే బోలెడంతా ఎంట‌ర్‌టైన్మెంట్ ఇచ్చే యూట్యూబ్ అంటే ఇష్ట‌ప‌డేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది టీవీలు చూడటం కూడా మానేసారంటే దీని ప్రభావం జనాలపై ఏ స్థాయిలో పడిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే లైవ్ టీవీ ని కూడా ఈ సోష‌ల్ మీడియా మనకి అందిస్తూ వస్తుంది.
 
ఇప్పటి వరకు వినోదానికే పరిమితమైన యూట్యూబ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంటర్ టైన్ మెంట్ వీడియోలతోపాటు వరల్డ్ వైడ్ గా జరుగుతున్న వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందించేందుకు బ్రేకింగ్ న్యూస్ పేరుతో ప్రత్యేకంగా వార్తలు అందించే ఏర్పాటు చేస్తోంది. 
 
వెబ్ హోంపేజీతోపాటు మొబైల్ యాప్ లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని యూట్యూబ్ యోచిస్తోంది. ఇందులో అన్ని రంగాలకు చెందిన న్యూస్ అందించనున్నట్లు సమాచారం. అయితే యూట్యూబ్ అందించే న్యూస్ గూగుల్ లో వచ్చినవా? లేక ప్రత్యేకంగా రాయిస్తుందా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి బ్రేకింగ్‌న్యూస్ యూట్యూబ్ ఎటువంటి మార్పుల‌కు తెర తీస్తుందోన‌ని ఇప్పుడు మీడియా వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: