యాపిల్ యూజర్ లకి శుభవార్త ని మోసుకొస్తూ కొత్త ఐ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేసింది. సంస్థ ని మొదలు పెట్టిన పదేళ్ళ సందర్భంగా విడుదల అయిన ఈ ఐ ఫోన్ టెన్ ఎక్స్ ని యాపిల్ సీఈవో టిం కుక్ విడుదల చేసారు.


ఈ ఫోన్ కి ఐ ఫోన్ 8 అంటూ పేరు పెడతారు అని అందరూ అనుకున్నారు కానీ దీనికి టెన్ పేరు పెట్టారు. 10 వ వార్షికోత్సవం కావడం తో ఈ పేరు పెట్టారు. పదేళ్ళ క్రితం సరిగ్గా అదే రోజున స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐ ఫోన్ ని ఆవిష్కరించారు అని టిం గుర్తు చేసుకున్నారు.


కొత్త ఫోన్ నవంబర్ నెల నుంచీ ఇండియా తో సహా అనేక దేశాలలో విడుదల అవుతుంది. ముఖానికి ఎదురుగా పెట్టుకుని కళ్ళతో అన్ లాక్ చెయ్యడం ,వైర్ లేకుండా చార్జింగ్ చేసుకోగలగడం దీని ప్రత్యేకత గా చెబుతున్నారు.


ఐ ఫోన్ టెన్ ఎక్స్ లో  5.8 అంగుళాల స్క్రీన్, 3డీ సెన్సార్లు, 12 ఎంపీ డ్యూయల్ కెమెరాలు, కనీసం 64 జీబీ అంతర్గత మెమొరీ తదితర సదుపాయాలున్నాయి. దీని ధరను రూ. 999 డాలర్లుగా నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: