భారత దేశంలో కొంత కాలంగా టెలికాం సంస్థలు కూడా మొబైల్స్ రేట్లను తగ్గిస్తున్నాయి.  మొన్న ఎయిర్టెల్ ,నిన్న BSNL  , నేడు వోడాఫోన్  ఇలా ప్రముఖ నెట్వర్క్ కంపెనీ లు అన్ని జియో 4g ఫోన్ కి పోటీ గా ఫోన్స్ విడుదల చేస్తున్నాయి . తాజాగా వోడాఫోన్ మైక్రో మాక్స్ తో కలిసి ఒక 4g స్మార్ట్ ఫోన్ ని నవంబర్ లో మార్కెట్ లోకి తీసుకు రానుంది . ఈ ఫోన్ కి మైక్రో మాక్స్ భారత్ 2 అల్ట్రా  అని పేరు పెట్టారు . దీని ధర రూ.2,899. 

అయితే వొడాఫోన్‌ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ ఉంది. రూ.2,899 వెచ్చించి ఫోన్‌ను కొన్న కస్టమర్లు వొడాఫోన్‌ సిమ్‌ను (కొత్త/పాత కనెక్షన్‌) వాడితే రెండు విడతల్లో రూ.1,900 రిఫండ్‌ పొందొచ్చు.  మొదట ఈ మొబైల్ ని మీరు ఎయిర్టెల్ ఫోన్ లాగా   2,899రూపాయలకు కొనుకోవాలి .తరువాత మూడు సంవత్సరాల వరకు నెలకు వోడాఫోన్ సిమ్ కి 150 రీఛార్జ్ చేయించుకోవాలి .

ఇలా మీరు రీఛార్జ్ చేయించుకుంటే మొదట ఒకటిన్నర సంవత్సరం కి మీకు 900 క్యాష్ బ్యాక్ ఇస్తారు . తరవాత ఒకటిన్నర సంవత్సరానికి ఇంకొక వేయి రూపాయలు క్యాష్ వెన్నకి ఇస్తారు . మొత్తం మీకు 1900 రూపాయలు వెన్నకి వస్తుంది .


మైక్రోమ్యాక్స్‌ భారత్‌-2 అల్ట్రా ఫీచర్లు          
* 4 జీబీ మెమరీ
*  512 ఎంబీ ర్యామ్
* 4 ఇంచెస్ స్క్రీన్
*  0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా
* 2 మెగాపిక్సెల్‌ కెమెరా
* ఆండ్రాయిడ్‌ 6.0
* 1300 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు ఓఎస్‌ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది మైక్రోమాక్స్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: