ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది.  కొత్త కొత్త పరికరాలు మనముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ రంగం ఎంతో అభివృద్ది చెందింది.  ఒక్క స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలా ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే లెక్క. ముఖ్యంగా సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి వాటితో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో డెవలప్ అయ్యింది.

ఇక చాలా మంది ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారు. తాజాగా ట్విట్టర్‌ వినియోగదారులకు శుభవార్త. ఇప్పటివరకు ఒక ట్వీట్‌ చేయాలంటే 140 అక్షరాలకు మించకుండా ఉండాలి.  నేటి నుంచి ఆ పరిమితిని 280 క్యారెక్టర్లకు పెంచుతూ ట్విట్టర్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత సెప్టెంబర్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో 280 అక్షరాలతో ట్వీట్‌ చేసుకోవచ్చు. అయితే కొరియన్‌, జపనీస్‌, చైనీస్‌ భాషలకు తప్ప ఇతర అన్ని భాషలకు వర్తిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: