సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన పిక్సల్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు  'పిక్సెల్ 2 ఎక్స్ఎల్‌' అమ్మ‌కాలు ఇవాళ్టి నుంచి భార‌త‌దేశంలో ప్రారంభ‌మ‌య్యాయి.గూగుల్ పిక్సల్ 2 (64 జీబీ) రూ.61వేలు ఉండగా, 128 జీబీ వేరియెంట్ ధర రూ.70వేలుగా ఉంది. గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ 64 జీబీ వేరియెంట్ ధర రూ.73వేలు ఉండగా, 128 జీబీ వేరియెంట్ ధర రూ.82వేలుగా ఉంది. 

బ్లాక్‌, బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో ఈ ఫోన్ ల‌భ్యమ‌వుతోంది. ఆన్‌లైన్‌లో అయితే ఫ్లిప్‌కార్ట్‌లో, ఆఫ్‌లైన్‌లో అయితే రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్ల‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్నాయి.
 
ఇతర ఫీచర్లు...
రెండు ఫోన్లలలోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఇక పిక్సల్ 2లో 2700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లో 3520 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. రెండు ఫోన్లలోనూ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: