భారత దేశంలో ఈ మద్య వివో స్మార్ట్‌ఫోన్ లకు బాగా గిరాకీ పెరిగింది.  తాజాగా వివో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ7'ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన బెజెల్ లెస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీనికి ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. వీ7ప్లస్‌ తరహాలోనే రూపొందించిన దీని ధరను రూ.18,990 గా నిర్ణయించింది. హై మెగా పిక్సెల్‌  కెమెరాలకు పేరొందిన వివో తాజా స్మార్ట్‌ఫోన్‌ కూడా  భారీ  సెల్ఫీ కెమెరాను అమర్చింది. ప్రత్యేకంగా  వివో స్టోర్లలోగానీ, ఫ్లిప్‌కార్ట్ ద్వారాగానీ  ప్రీ బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంది.  నవంబరు 24నుంచి  విక్రయానికి లభ్యం కానుంది.  

Vivo V7 with 5.7-inch Full View display, 24MP selfie camera launched in India at Rs 18,990 - Sakshi - Sakshi - Sakshi

వివో వీ7 ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: