చైనా మొబైల్ దిగ్గజం షియోమి రెడ్‌మి సీరిస్‌లో ఈ నెల 30న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో ఈ నెల 30న విడుదల చేయనుంది. కాగా లాంచ్ అయిన తరువాత డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ ఫోన్ అమ్మకానికి వెళుతుందని కంపెని తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

భారత్‌లో హైఎండ్‌ వేరియంట్ల విషయంలో వన్‌ప్లస్‌, హువాయ్‌ నుంచి గట్టి పోటీ, ఈ కంపెనీ తన సత్తాను చాటలేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లపై షావోమి దృష్టి సారించింది.  షావోమి ఎంఐ 7 పేరుతో వచ్చే ఏడాది ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో ఇది రూపొందుతుంట. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, వన్‌ప్లస్‌ 5టీకి గట్టిపోటీ ఇవ్వగలదని తెలుస్తోంది. 


షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు :

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.



మరింత సమాచారం తెలుసుకోండి: