మెమోరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్‌ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్‌ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. ఇక స్మార్ట్‌ఫోన్ల కోసం ప్ర‌త్యేకంగా 512 జీబీ ఉన్న మెమొరీ చిప్‌ల ఉత్ప‌త్తిని శాంసంగ్ కంపెనీ ప్రారంభించింది.

ఈ మేర‌కు శాంసంగ్ ఎల‌క్ట్రానిక్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. మైక్రో ఎస్‌డీ కార్డుల్లో సాధార‌ణంగా త‌లెత్తే ప‌ర్‌ఫార్మెన్స్ స‌మ‌స్య‌లను కూడా ఈ కొత్త చిప్‌లు అధిగ‌మిస్తాయ‌ని శాంసంగ్ ప్ర‌తినిధులు తెలిపారు.

ఈ మెమొరీ చిప్‌ల పనిత‌నం కూడా చాలా మెరుగ్గా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.ఈ మెమొరీ చిప్‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే త్వ‌ర‌లోనే హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ల త‌యారీని కూడా తాము చేప‌ట్ట‌నున్న‌ట్లు శాంసంగ్ ఎల‌క్ట్రానిక్స్ ప్ర‌క‌టించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: