ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే సంస్థ ఓక్లా  తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. మొబైల్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్‌లో భారత్‌ 109వ స్థానంలో నిలిచింది.  బ్రాండ్‌ బ్యాండ్‌ స్పీడ్లో 76వ  స్థానంలో నిలిచింది.   గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్‌ నెల గణాంకాలను ఓక్లా  విడుదల చేసింది.   దీని ప్రకారం సగటు మొబైల్‌ డోన్‌లోడ్‌ స్పీడ్‌ 7.65  ఎంబీపీఎస్‌ గా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌ బ్యాండ్‌ వేగం  76 వ స్థానంలో ఉంది. 

ఈ సగటు  జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబరులో 18.82 పాయింట్లుగా నిలిచిందని  ఓక్లా తెలిపింది.ఇండియాలో మొబైల్‌  ఇంటర్‌నెట్‌  స్పీడ్‌, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ వేగం  భారీగా పుంజుకుంటోందని పేర్కొంది. ఈ నూతన సంవత్సరానికి మార్కెట్ ఎలా వృద్ధి చెందుతుందో చూడడానికి తాము ఎదురుచూస్తున్నామని ఓక్లా సహ వ్యవస్థాపకుడు,  జనరల్ మేనేజర్ డౌగ్ సూట్లేస్  వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: