ఈ మద్య కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు సామాజిక సేవలో కూడా మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారు. చరిత్ర పుటల్లో ఒక్కసారి చూస్తే..ఝాన్సీలక్ష్మీభాయి, రాణి రుద్రమదేవి రాజపరిపాలన మగవారికంటే ఎక్కువ సమర్థవంతంగా చేసి మగవారితో సమానంగా యుద్దాల్లో పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదించారు..ఇక సమాజ సేవ విషయానికి వస్తే ఎక్కడో అల్బేనియా  జన్మించిన రోమన్ క్యాథలిక్  మన భారత దేశంలో కలకత్తా నగరానికి వచ్చి అక్కడ పేద ప్రజలు పడుతున్న బాధలకు చలించిపోయి వారి ఎన్నో సేవలు చేసింది.


ఇలా  ప్రపంచ దేశాల్లో మహిళలు ఎన్నో సాధించారు. మన భారత దేశంలో ర్నాటక రాష్ట్రానికి చెందిన ఈమె పేరు తిమ్మక్క. ఈమె చేసిన పని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ మద్య మనిషి తన స్వార్థం కోసం ఎక్కడ కొంత స్థలం దొరికితే అక్కడ పాతుకుపోతున్నాడు. కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నాడు. చెట్లు చేమలు అన్నీ సర్వ నాశనం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో తిమ్మక్క చేసిన పని అందరూ గర్వపడేలా ఉంది. వయసు మీద పడుతున్నా భవిష్యత్ తరాల వారి కోసం ఈమె చేసిన పని చూస్తే..ఔరా అనిపిస్తుంది. తిమ్మక్క అకుంటిత దీక్ష ఎందరికో ఆదర్శంగా నిలిచి, భారత, అమెరికా ప్రభుత్వాల గుర్తింపును పొందింది. ఒక మొక్కను నాటి , దానిని రక్షించడానికి ట్రీ గార్డులను పెట్టి అనేక అవస్థలు పడుతున్న కాలంలో ఈ మహిళ ఏకంగా 4 కిలోమీటర్ల పరిధిలో 284 మర్రి చెట్లను నాటి, వాటిని సంరక్షిస్తూ ప్రపంచం అబ్బురపడేట్లుగా చేసింది.


తానునాటిన మొక్కలు అంటూ గర్వంగా చూపిస్తున్న తిమ్మక్క

అసలు విషయానికి వస్తే తిమ్మక్క అనే వృద్ద మహిళ ఒక క్వారీలో దినసరి కూలీగా పని చేస్తుండేది. వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు ఈమెకు సంతానం కలగలేదు. అయినవారు ,కానివారు అందరూ సూటి పోటి మాటలు అంటూ ఉండటంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయింది. ఆ వేదనలోనే తన ఇంటి నుండి క్వారీ కి వెళ్ళే మార్గంలో దఫ దఫాలుగా మర్రివిత్తనాలను నాటుతూ వెళ్ళింది. అయితే క్వారీలో  పనికి వేళుతున్న సమయంలో వాటిని సురక్షితంగా చూసుకుంటూ ఎంతా అంటే అవే తన సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చింది.  


చెట్ల మద్య ఆనందంగా నడుచుకుంటూ వస్తున్న తిమ్మక్క

అలా మొత్తం 4 కిలోమీటర్ల దూరంలో 284 చెట్లను సంరక్షించి, తన మాతృప్రేమను ఆ చెట్లపై చూపించింది. ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా " National Citizen's Award " ను గెలుపొందింది. అదే విధంగా అమెరికాలోని ఒక పర్యావరణ సంస్థ " Thimmakka's Resources for Environmental Education " అనే విభాగాన్ని ఈమె పేరు మీద ఏర్పరిచి గుర్తింపును ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు వయసు మీద పడటంతో, ఆ చెట్ల యొక్క సంరక్షణ బాధ్యతలను కర్నాటక ప్రభుత్వం స్వీకరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: