దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు..మేం తలుచుకుంటే మగవారితో సమానంగా అన్నింటా పోటీ పడుతామంటున్నారు. రాజకీయాలు, పారిశ్రామిక, రక్షణ రంగాల్లో, సేవా రంగాల్లో దేనిలో అయినా తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. భారత దేశంలో మొట్ట మొదటి మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ ఎందరో యువతులకు ఆదర్శంగా నిలిచారు. తాజాగా హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ సమక్షంలో మద్యం అక్రమ విక్రయాలపై సమీక్ష వాడీవేడిగా జరుగుతుంది.

ఈ సమావేశాని జిల్లా అధికారులు అంతా హాజరయ్యారు. ఇక మద్యం అక్రమ విక్రయాలు ఆపాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారికి మేం ఏం సమాధానం చెప్పాలి అంటూ అధికారులపై విమర్శలు చేశారు మంత్రి అంతే కాదు జిల్లా ఎస్పీ సంగీతపై కూడా మీటింగ్ మొదలైనప్పటి నుంచి రుస రుస లాడటం మొదలు పెట్టారు. దీంతో విసుగెత్తిన ఆమె మద్యం లైసెన్స్ లు ప్రభుత్వం ఇచ్చి, పోలీసులను అనటం సరికాదు సార్ అని ఆమె అనడంతో ఒక్కసారిగా కోపానికి వచ్చిన మంత్రి గెట్ అవుట్ అంటూ ఆమెపై నోరు చేసుకున్నారు.

దీంతో అంతా అవాక్కైపోయారు..ఇంతలోనే ఎస్పీ సంగీత వై..నేనెందుకు వెళ్లాలి..నేనేం తప్పనలేదే..అని సమాధానం ఇవ్వడంతో అవమానంగా ఫీల్ అయిన మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు.   ప్రభుత్వ ఖజానా నింపాలని మద్యానికి  పర్మీషన్స్ ఇవ్వడం తర్వాత వచ్చి పోలీసుల మీద పడడం ఆ అమాత్యులకు బాగా అలవాటైంది,  అలాంటి వారికి బాగా బుద్ది చెప్పావ్ శబాష్  అంటూ  పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటీజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: