మటన్ కవాబ్ కి కావాల్సిన పదార్థాలు:-మటన్‌: కిలో (ఖీమాలా కొట్టించాలి), టొమాటోలు: 8, ఉల్లిపాయలు: ఒకటి (సన్నగా తురమాలి), సోమక్‌ (పర్షియన్‌ హెర్బ్‌): 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాలు: తగినన్ని.


తయారుచేసే విధానం: 

* మటన్‌లో ఉల్లితురుము, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.

* తరవాత ఈ మిశ్రమాన్ని 8 గుండ్రని బంతుల్లా చేయాలి .

* ఇప్పుడు ఓవెన్‌లో పెట్టే ఎనిమిది చువ్వలు తీసుకోవాలి. ఈ ముద్దల్నిచక్కగా చువ్వ చుట్టూతా అంటించాలి. ఇప్పుడు వీటిని ఓవెన్‌లో పెట్టి గ్రిల్‌ చేయాలి.

* అలాగే టొమాటోలను విడిగా గ్రిల్‌ చేయాలి.

* కబాబ్‌లు బయటకు తీశాక సోమక్‌పొడిని చల్లి వడ్డించాలి. ఇవిరోటీ లేదా బటర్డ్‌ రైస్‌లోకి కూడా బాగుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: