టొమోటో మాకరోని తయారీలో వాడే పధార్థాలుం:  మాకరోని : 100 గ్రాములు టమాటోముక్కలు: 2 కప్పులు ఉల్లిముక్కలు :2 కప్పులు పచ్చిమిర్చిముక్కలు : 1 చెంచా  అల్లం, వెల్లుల్లి పేస్టు : 1చెంచా ధనియాల పొడి: ¼ చెంచా జీలకర్ర పొడి : ¼ చెంచా మిరియాలపొడి : చిటకెడు ఉప్పు :సరిపడ కారం :1/2 చెంచా  నూనె : 5 చెంచాలు కొత్తిమీర : 2 చెంచాల ఆకులు


తయారీ ఎలా ? రెండు గ్లాసుల నీరు ఎసరు పెట్టి ఒక చెంచా నూనె వేసి కాగనివ్వాలి.  కాగిన నీటికి మెకరొని వేసి 4 నిమిషాలు ఉడకించాలి. ఉడికిన నీటిని వార్చాలి. మిర్చిముక్కలు వేసి వేపాలి. వేగిన వీటిలో అల్లం- వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేపాలి. తరువాత టొమోటా ముక్కలు వేసి బాగా కలపాలి.


ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. టొమోటాలు మగ్గి నూనె వేరుపడుతున్నప్పడు కారం, మిరియాల పొడి, ధనియాల, జీర పొడి వేసి ఒక నిమిషం వేపాలి. వేగుతున్న వీటికి గరంమసాలా, కొత్తిమీర, ఉడికించిన మేకరొని వేసి ఒక నిమిషం బాగా కలిపి తీయాలి. వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి. ఇది పుల్కాలకీ, చపాతీలలోకి కర్రీలాగా కూడా బావుటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: