మనం తినే రోజూ ఆహారంలో వెరైటీ వంటలు చేసుకొని తినాలని ప్రతిరోజూ అనిపిస్తుంది..అయితే కొంత మంది మహిళలు వీటికోసం టీవీలు, పుస్తకాలు తిరగేస్తుంటారు. నోటికి రుచికరమైనది ఏదైనా ఇంట్లో వారు చాలా ఇష్టంగా తింటారు..అంతే కాదు రోజూ వండే వంటలు వండుతుంట ఏవరికైనా బోర్ కొడుతుంది. సో..మీకోసం హాట్ డాగ్ రోల్స్ ప్రై  తయారు చేయడం ఎలా చూడండి.

తయారీలో వాడే పధార్థాలు :  హాట్ డాగ్ రోల్స్ : 2 కరిగిన బటర్ : 2 చెంచాలు   ఫిల్లింగ్ కి కావలసిని :  కార్న్ కెర్నల్స్ : ½ కప్పు ఉల్లిముక్కలు : ½ కప్పు పాలు : ½ బ్రెడ్ స్లయిస్ : 1 పచ్చి మిర్చి : 1 పంచదార : ¼  బటర్ : 2 చెంచాలు ఉప్పు : సరిపడ పెప్పర్స్ : సరిపడ డెకరేషన్ కి : ఛీజ్ : 1/4 కప్పు (తురిమినది) తయారీ ఎలా ? ముందుగా డాగ్ రోల్స్ లోని మధ్య సాప్ట్ పోర్షన్ని తీసి ఆ పధార్థాన్ని ప్రక్కన ఉంచి ఫిల్లింగ్లోకి వాడాలి. డాగ్ రోల్స్ పైన బటర్ ని వ్రాయాలి.


వీటిని హాట్ ఓవెన్ లో 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలుపాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటికి మైదా కలపి 10 సెకండ్లు వేపాలి. తరువాత కార్న్ కర్నల్, బ్రెడ్ స్లైస్ ముక్కలు డాగ్రోల్స్ లోంచి తీసిన పధార్థాన్ని పంచదార, ఉప్పు, పప్పర్ సరపడ వేసి బాగా కలిపి ఫిల్లింగ్ మిశ్రమాన్ని తయారు చేసకోవాలి.  5 నిమిషాలు బేక్ చేసి తీసి డాగ్ రోల్స్ లో ఈ ఫిల్లింగ్ మిశ్రమాన్ని మనం డాగ్రోల్స్ లోపిలి భాగంలో స్కూప్ చేసిన భాగంలో పెట్టి ప్లేట్లో పెట్టాలి.


ఇలా అన్నింటికి ఫిల్లింగ్ పెట్టి ప్లేట్ లో పెట్టి వాటి మీద తురిమిన ఛీజ్ చల్లాలి.  తరువాత క్యాప్సికమ్, టొమోటా ముక్కులు కూడా వాటి మీద గుండ్రంగా అలంకిరించి 2 నుండి 3 నిమిషాలు హాట్ గ్రిల్ లో పెట్టి తీసి వేడి వేడిగా సర్వ్ చేయ్యాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: