మనం రోజూ వండుకునే కూరగాయల్లో ఆలు కర్రీ అంటా పెద్దలు, పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. అలు వేపుడు, ఆలూ కూర్మ,టమాటా ఆలుగడ్డ ఇలా రక రకాలుగా వంటలు వండుకోవచ్చు..అంతేకాదు ఆలుతో బిర్యాని కూడా వేస్తారు. ఇలా ఆలూ  కాంబినేషన్లో రక రకాల నోరూరించే వంటలు వండుకొని సంతోషంగా బోజనం చేయవచ్చే.. ఇక ఆలు పాలక్ తో కర్రీ ఏవిధంగా చేస్తారో చూడండి.!

తయారీలో వాడే పధార్థాలు :  ఆలు : అరకిలో పాలకూర : 3 కప్పులు కార్న్ ఫోర్ల :50 గ్రాములు వెల్లుల్లి పేస్టు :1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు : 1 చెంచా  ఎండుమిర్చి : 2 అల్లం పేస్టు : ½ చెంచా  గరంమసాలా : ½ చెంచా నిమ్మరసం : 1 చెంచా నెయ్యి : 4 చెంచాలు తయారీ ఎలా : ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసి సన్నని ముక్కలు కట్ చేసి ఉంచాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేయాలి.


పాలకూరని బాగా కడిగి చెయ్యాలి. ఆలు కూడా సన్నగా కట్ చేయాలి. వీటిని కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తరువాత పొయ్యి ఆర్చాలి. కొంచెం నీరు పోసి పేస్టులాగా చేయాలి.  ఈ పేస్టుకి క్రీం కూడా జతచేసి బాగా కలిపి ఉంచాలి. బాండిలో 1 చెంచా నెయ్యి వేసి దాంట్లో జీలకర్ర, ఉల్లిముక్కలు, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చ, ఎండి మిర్చి ముక్కలు కూడా వేసి ఎర్రగా వేపాలి. వేగిన వీటికి కార్న్ ప్లోర్ మిక్సర్ వేసి బాగా కలపాలి.


ఈ లోపు పాలక్, ఆలు తీసి నీరంతా జల్లెడ పోసి ఉంచాలి. వేగిన ఉల్లిముక్కల మిశ్రమాన్ని ఈ పాలకూర, ఆలు వేసి రెండు నిమిషాలు వేపాలి. వీటిమీద మూతపెట్టి 4 నుంచి ఎనిమిది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలపుతూ ఉండాలి. మంట ఆర్పి నిమ్మరసం వేసి బాగా కర్రీకి పట్టించాలి. తరువాత తీసి సర్విసింగ్ డిష్లో కూరని పెట్టి రోటి, చపాతిలలోకి సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: