బిర్యాని ప్రేమికలకు ఇది కొత్త రుచి సేమియా బిర్యాని కూడా ఓ ట్రెడీషినల్ వంటలా మారబోతుంది. ఎందుకంటే మన సాంప్రాదయ వంటకాల్లో సేమియాతో పాయసం....ఉప్మా, పేమియా ఇడ్లీ ఇలా చాలా వెరైటీ రుచులకు తయారు చేసుకొంటాం కాబట్టీ, అయితే ఎవైతే సేమియా ఉప్మా, ఇడ్లీ వంటివి ఇష్టపడరో వారు ఇలా హాట్ మరియు స్పైసీ సేమియా బిర్యాని ప్రయత్నించి కొత్త రుచిని ఆశ్వాదించవచ్చు. ఇది రైస్ ఇష్టపడని వారు కూడా ప్రయత్నించవచ్చు  


కావాలసిన పధార్ధాలు : సేమియా : 2 కప్పులు  చికెన్ ముక్కలు : 1 కప్ (చికెన్ సేమియా బిర్యాని) లేదా వెజిటేబుల్స్ : 1 కప్( వెజ్టేబుల్ సేమియా బిర్యాని)  ఉల్లిపాయలు : (ముక్కలుగా కట్ చేసుకొన్నవి)  టామోటా :1 అల్లం వెల్లుల్లి పేస్టు : 2 టీస్పూన్స్ పచ్చిమిర్చి : 2  బిర్యని మసాలా : 2 టీ స్పూన్స్ పసుపు : ½ టీ స్పూన్లు జీలకర్ర పొడి : 1 స్పూన్  కారం : మీ రుచికి తగినంత పుదీనా : ½ కప్  కొత్తిమీర : ½ కప్  గరం మసాలా : (బిర్యాని ఆకు:1, చెక్క, 2 చిన్న ముక్కలు,  లవంగాలు : 3, యాలకులు : 3) పెరుగు : కప్ నెయ్యి : 1టేబుల్ స్పూన్ నూనె : 1 టేబుల్ స్పూన్ ఉప్పు : రుచికి తగినంత వెజిటేబుల్ బిర్యానికి వెజిటేబుల్ (క్యారెట్, బంగాళదుంప. బీన్స్, పచ్చిబఠానీ, క్యాప్స్కమ్, కాలీప్లవర్, ఇటీసీ) తయారు చేయు విధానం :  ముందుగా చికెన్ శుభ్రం చేసి ఒక గిన్నే తీసుకొని అందులో పెరుగు, గరం మసాలాపొడి, ఉప్పు, కారం, మరియు పసుపు వేసి బాగా కలిపి చికేన్ కు పట్టించి పక్కన పెట్టుకోవాలి.


చిన్నపాత్ర తీసుకొని అందులో సేమియాను కూడా వేసి బాగా కలపాలి. సేమియా బాగా పొడిపొడిగా అయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడకనివ్వాలి. (75 శాతం ఉడికిన తర్వాత నీళ్లు ఏమైనా ఉంటే వంచేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మరో గిన్నె తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గరం మసాలా సిద్దం చేసుకొన్నవి వేసి వేయించాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రాస్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకూ బాగా వేయంచుకోవాలి. ఇప్పడు చట్ చేసిపెట్టుకున్న టమోటాతో ముక్కలు వేసి వేయించి మొత్తంగా ఉడకనివ్వాలి. తర్వాత పుదీనా ఆకులు, కొత్తీమీర తరుగు, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.


ఇప్పుడు ముందుగా మసాలా అంటించి పెట్టుకొన్ని చికెన్ అందులో వేసి బాగా వేయించాలి. చికెన్ , మసాలా మిశ్రమం బాగా కలిపి ఉడికేలా చూసుకోవాలి. చికెన్ ఉడికిందని మీరు నిర్ధారించుకొన్నప్పుడు అందులో తగినంత ఉప్పు, ఉడికించి పెట్టుకొన్న సేమియా వేసి మరో రెండు నిమిషాలపాటు మసాలా సేమియాకు పట్టే విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పాన్ కు సరిగా సరిపోయే మూత పెట్టి మంట తగ్గించి ఆవిరి మీదే మరో పది నుండి పదిహేను నిమిషాలపాటు ఉడికించుకోవాలి. (లేదా ఓపెన్ లో కూడా పెట్టుకోవచ్చు) పదినిమిషాల తర్వాత కొత్తిమీర తరగు, జీడిపప్పుతో గార్నిష్ చేసి ఏదేని రైతాల్ హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే చికెన్ సేమియా బిర్యాని రెడీ వెజిటేబుల్ భిర్యాని కూడా ఇదే పద్దతిలో తయారు చేసుకోవచ్చు, అయితే చికెన్ లో మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: