కావలసిన పదార్థాలు: చేపలు : అర కేజీ నూనె : 30మి.లీ. ఇంగువ : చిటికెడు ఆవాలు : 1 స్పూన్ జీలకర్ర : అర టీస్పూన్ మెంతులు: అర టీస్పూన్ టమాటాలు : అర కేజీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్‌లు ఉల్లిగడ్డలు: 2 కరివేపాకు : 10 రెమ్మలు ఉల్లి, టమాటా చాప్ మసాలా : 4స్పూన్‌లు చింతపండు రసం : 50మి.లీ. కారం : 3స్పూన్‌లు ధనియాల పొడి : 1 స్పూన్ పసుపు : అర టీ స్పూన్ జీలకర్ర పొడి : అర టీ స్పూన్ గరం మసాలా : అర టీ స్పూన్ కొత్తిమీర : 1కట్ట ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం: టమాటాలను ఉడికించి గుజ్జులా చేసుకోవాలి. ఇక్కడ ఉల్లి, టమాటా చాప్ మసాలా తయారు చేయాలంటే.. ముందుగా కడాయిలో నూనె పోసి ఉల్లిపాయలను వేయించి ఆ తర్వాత టమాటా ప్యూరీ, కారం, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. దీన్నే చాపింగ్‌కి ఉపయోగించాలి. కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేగాక ఉల్లిపాయముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, ఇంగువ, టమాటా ప్యూరీ వేసి బాగా కలపాలి.

నూనె బయటకు వచ్చేవరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి కాసేపటి తర్వాత చేపలు వేయాలి. పదినిమిషాల తర్వాత కొత్తిమీర, ఉల్లి, టమాటా చాప్ మసాలా, గరం మసాలా వేసి దించేయాలి. రుచికరమైన టకారీ మల్లు రెడీ! ఇది శ్రీలంక స్పెషల్ డిష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: