కావలిసిన పధార్థాలు : గోంగూర : కప్పు రొయ్యలు : కప్పు నెయ్యి : నాలుగు చెంచాలు టమాటాలు : మూడు అల్లంవెల్లుల్లి పేస్టు : చెంచా ఉల్లిపాయలు : రెండుః పచ్చిమిర్చి, ఎండుమిర్చి :నాలుగు తాలింపు దినుసులు : అన్నీ కలిపి కొద్దిగా. ధనియాలపొడి : అరచెంచా పసుపు : అరచెంచా కారం : రెండు చెంచాలు ఉప్పు : రుచికి తగినంత కరివేపాకు, కొత్తీమీర : గార్నీషింగ్ కోసం


తయారు చేయువిధానం : గోంగూర భాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి, షాన్ లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యలు వేసి బాగా వేయించాలి, ఈ వేయించిన రొయ్యలు నెయ్య లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి మిశ్రమం ఆ తర్వాత టమాటా ముక్కలు చేర్చాలి.  


ఆ తరువాత ఉడికించి వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర సిద్దం అయినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: