వెజిటబుల్ చిల్లీ మష్రూమ్ కావలసిన పదార్థాలు : బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 500 గ్రాములు క్యాప్సికమ్: 200 గ్రాములు ఉల్లిపాయలు: 2 అల్లం: 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు: 6-8 నూనె: కావలసినంత కారంపొడి: 1 టీస్పూన్ డార్క్ సోయా సాస్: 2 టీస్పూన్ వెనిగర్: 2టీస్పూన్  కార్న్‌ఫ్లోర్: 1టేబుల్ స్పూన్ మంచినీరు: 1 కప్ ఉప్పు: రుచికి సరిపడా



తయారు చేయు విధానం : 1. మొదటగా మష్రూమ్స్‌(పుట్టగొడుగులను)రెండుగా కట్ చేసుకోవాలి. 2. తర్వాత క్యాప్సికమ్‌లను కూడా సగానికి కట్ చేసి వాటిలోని విత్తనాలను తీసివేసి కొంచెం మందంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.


3. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 4. పాన్ లో కొద్దిగా నూనెను వేడిచేసి, అందులో నూరిన మిశ్రమాన్ని వేసి వేయించాలి. 5. అందులోనే కారంపొడి కూడా వేసి పావుకప్పు నీటిని చేర్చి, మిశ్రమం గట్టిపడేంతదాకా సిమ్‌లో ఉడికించాలి. 6. ఇప్పుడు అందులో సోయాసాస్ మరియు వెనిగర్ వెసి కలియబెట్టాలి. అలాగే కొద్దిగా నీటిలో కార్న్ ఫ్లోర్ తీసుకోని కలిపి అందులో పోయాలి.


7. ఆ తరువాత క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కల్ని వేసి తగినంత ఉప్పుకూడా చేర్చి కలిపి, మూతపెట్టి సిమ్‌లో బాగా ఉడికేంతవరకూ మగ్గించాలి. అంతే చిల్లీ మష్రూమ్ రెడీ. దీన్ని వేడి వేడిగా వెజిటబుల్ రైస్ లేదా నూడుల్స్‌తో కలిపి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: