ప్రపంచంలో శాకాహారుల కన్నా మాంసాహారులే ఎక్కువ మంది ఉన్నారు..అయితే ఈ మాంసాహారాన్ని రక రకాలుగా వండి తింటుంటారు. ముఖ్యంగా మటన్ కీమా ఎన్నో రకాలుగా వండి తినడం మనం చూస్తుంటాం.  పౌష్టికర ఆహారంగా కీమాను చాలా మంది తింటుంటారు..ఇక కిమా ఇష్టపడే వారు కీమా పాస్టా వంటకం ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. 

మటన్ లేదా చికెన్ కీమా : 250 గ్రా.లు పాస్టా : 250 గ్రా.లు ఉల్లిపాయ : 2 టమాటాలు : 3 అల్లం వెల్లుల్లి ముద్ద : 2 టీ స్పూను పసుపు : 1/3 టీ స్పూను కారం పొడి : 2 టీ స్పూను ధనియాల పొడి : 2 టీ స్పూను గరం మసాలా పొడి : 1/2 టీ స్పూను ఉప్పు : తగినంత కొత్తిమిర : 3 టీ స్పూను నూనె : 5 టీ స్పూను తయారీచేయు విధానం : లీటర్ నీరు మరిగించి పాస్టా వేయాలి. అది ఉడికిన తర్వాత జల్లెట్లో వేసి చన్నీళ్లు పోయాలి. దానివల్ల అవి ఇంకా ఉడికి ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటాయి. కీమా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.


పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు కీమా వేసి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి కలిపి నీరంతా పోయేవరకు వేయించాలి. తర్వాత ఒక కప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.కీమా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి.


ఇప్పుడు ఉడికించిన పాస్టా, సన్నగా తరిగిన కొత్తిమిర, గరం మసాలా పొడి వేసి కలిపి మరో పది నిమిషాలు నిదానంగా ఉడికించాలి. మొత్తం ఉడికినతర్వాత దింపి వేడిగా సర్వ్ చేయాలి. నాన్ వెజ్ తిననివాళ్లు మటన్ కీమా బదులు సోయా కీమా, పనీర్ కూడా ఉపయోగించవచ్చు…  


మరింత సమాచారం తెలుసుకోండి: