వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా ఏవైనా తింటే చాలా బాగుంటుందని అందరికీ ఉంటుంది. కొంత మంది ఇంట్లో బజ్జీలు,గారెలు వేసుకుంటే కొంత మంది బయట హోటల్స్ కి వెళ్తుంటారు. ఇక రోడ్లపై పెట్టే చిన్న బండ్లపై పెట్టి అమ్ము గప్ చుప్..మిర్చీలు తింటుంటారు. అయితే బయట ఫుడ్ ఇష్టపడని వారు ఇంట్లోనే చక్కటి వంటకాలు చేసుకొని తింటారు.   చల్లటి వాతావారణం ఇంట్లో వేడి వేడి ఛాట్స్ చేసుకుని తినాలని ఉందా....? వెరైటీగా వెజ్ చెన్నా చోలీ రెడీ చేసుకుని వేడి వేడిగా తినేయండి.


వెజ్ చెన్నాచోలీ ఎలా తయారీ చేయాలంటే...   ముందుగా ఆలూ, బీన్స్, క్యారెట్, క్యాబేజీ, కాలిప్లవర్, కాప్సికమ్.. వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయలు ముక్కలు ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి. అర చెంచా టీ పొడి వేసి మూటకట్టి, చెన్నాతో కలిపి ఉడికించి పక్కన బెట్టుకోవాలి.  చెన్నా ఉడికిన తర్వాత టీ బ్యాగ్ ను తీసేయాలి. తర్వాత రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయించి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. అలాగే రెండు టమోటోలు ఉడికించి పీచు తీసి ముద్దచేసుకోవాలి.


ఇక వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే ..? మూకుడులో నూనె వేసి వెచ్చగా అయినాకా బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, యాలకుల పొడి వేసి దోరగా వేయించుకోవాలి.  తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా వేపుకోవాలి. అనంతరం సన్నగా తరిగిన టమోటా ముక్కలన్ని అందులో చేర్చాలి. అల్లం, ఉల్లిపాయలు, టమోటా పేస్టు కూరలా పేస్టు కూరాలా వచ్చేదాకా వేయించాలి. కూరగా అయిన మిశ్రమంలో జీడిపప్పు పేస్ట్ను వేసి కలపాలి. ఒక కప్పు కూరగాయాల ముక్కలు తెల్ల శనగలు వేసి తగిన ఉప్పు వేసి కలియతిప్పాలి.


కాసేపు మంటపై తెల్లశనగల మిశ్రమాన్ని ఉడికించి, రెండు చెంచాల పెరుగు, వెన్నతో పాటు చెన్నా ఉడికించిన నీళ్లు పోసి కూరను మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఆమ్చార్ పౌడర్ గరం మసాలా పొడి, వేయించిన ధాన్యం, జీరాపొడి చేర్చాలి. ఘుమ, ఘుమా వాసన వస్తుండగానే చోలే మసాలా సరిపడా వేసి ఐదు నిమిషాలు నుంచి పది నిమిషాలు ఉంచి,  స్టౌవ్ మీద నుంచి దించేయాలి. ఇంకేముంది. వెజ్ చోలీ రెడీ!

మరింత సమాచారం తెలుసుకోండి: