సాధారణంగా మనకు సీజనల్ గా దొరికే మామిడితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మామిడి పచ్చడి,మామిడి పప్పు గురించి మనం ఎక్కువగా వింటుంటా..కానీ మామిడితో వెరైటీ పులావ్ ఎంతో బాగుంటుంది. మరి ఈ మామిడి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామా..! 

కావలసిన పధార్థాలు:బాస్మతి రైస్: 2cups(శుభ్రం చేసి నీటిలో నానబెట్టుకోవాలి) పచ్చిమామిడి: 1 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి) జీలకర్ర: 1/2 tsp పచ్చిమిర్చి: 2 (slit) చెక్క: చిన్న ముక్క యాలకులు: 4 లవంగాలు: 4 మిరియాలు: 6 నెయ్యి: 1tbsp పసుపు: 1/2 tsp జీలకర్ర: 1tsp అల్లం: 1చిన్న ముక్క(తురుము కోవాలి) ఉప్పు: రుచికి సరిపడా 


తయారు చేయు విధానం: 

- ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు పచ్చిమిర్చి ముక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి రెండు నిముషాలు లైట్ గా వేగించుకోవాలి. 

- ఒక నిముషం తర్వాత అల్లం తురుము వేసి మరో నిముషం వేగించాలి.

 - ఇప్పుడు అందులోనే పచ్చిమామిడి తురుము వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 

- అందులోనే పసుపు ఉప్పు వేసి మరో నిముషా వేగించి, తర్వాత శుభ్రం చేసినానబెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. 

-ఇప్పుడు అందులో 3కప్పుల నీళ్ళు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. 

- తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల తర్వాత మూత తీసి మాంగో పులావ్ ను గరం మసాల మరియు కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మాంగో పులావ్

మరింత సమాచారం తెలుసుకోండి: