కావలసిన పధార్థాలు : మామిడికాయలు : 6 కారం : ¼ కిలో ఉప్పు : ¼ కిలో మెంతిపిండి : ½ కప్పు నూనె : ¼ కిలో ఇంగువ : 1 చెంచా ఆవాలు : ½ కప్పు మిరపకాయలు : 5 తయారు చేయు విధానం : ఎప్పటిలా మామిడికాయలు ముచ్చికలు తీసి 2 గంటలు నాననిచ్చి తీసి శుభ్రమైన గుడ్డతో పొడిగా తడిచి బాగా ఆరనివ్వాలి.

తరువాత ఒక్కక్కటిని చెక్కు తీసి కొబ్బరి సన్నగా తురిమాలి. మొత్తం తీసిన తర్వాత ఒక బేసిన్ లో ఈ తురుము వేసి ఉప్పు, పసుపు వేసి ఒక రాత్రి ఉంచాలి. మరుసటి రోజు తురుము పిండి ఆ తురుములో కారం, మెంతిపిండి వేసి బాగా కలిపి దానిమీద రసం పోసి మళ్ళీ కలపాలి. బాండీలో నూనె వేసి ఆవాలు, మిరపకాయలు, ఇంగువ తాలింపు వేసి చల్లార్చి తురుము మిశ్రమానికి కలిపి బాగా కలిపేటట్లు తిప్పాలి. జాడీలోకి తీసి ఉంచాలి.. ఈతురుము పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: